: తిరుమలలో గోవిందనామ స్మరణ తప్ప మరేదీ లేకుండా చేస్తా: చంద్రబాబు
గత పదేళ్ల కాలంలో తిరుమల పవిత్రత పూర్తిగా దెబ్బతిందని... ఎన్నో అవకతవకలు జరిగాయని కాబోయే సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమలను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో తిరుమలలో గోవిందనామ స్మరణ తప్ప మరేదీ లేకుండా చేస్తానని తెలిపారు. ఈ రోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.