: శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు మహాద్వారం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబసభ్యులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. బాపిరాజు, ఆలయ అధికారులు చంద్రబాబుకు స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.