: ఏ ప్రాంతంలో పనిచేయాలన్న విషయాన్ని ఉద్యోగులకే వదిలిపెట్టాలి: అశోక్ బాబు


ఉద్యోగుల అభిప్రాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఏ ప్రాంతంలో పనిచేయాలన్న విషయాన్ని ఉద్యోగులకే వదిలిపెట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగస్తుల అభిప్రాయాలు గౌరవించడం ప్రభుత్వం విధి అని అన్నారు.

జూన్ రెండో తేదీ నుంచి రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవిస్తుందని, దీంట్లో ఉద్యోగుల పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, ఆరోగ్య కార్డులు ఇవన్నీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తుందని అశోక్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News