: లోక్ సత్తా రాజకీయాల నుంచి ఎక్కడికీ పారిపోదు: జేపీ
ఎన్నికల్లో ఓటమికి నైతిక బాథ్యత తనదేనని, ఓటమి కారణాలపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. జాతీయ కార్యవర్గం నిర్ణయంపై తన రాజీనామా ఆధారపడి ఉంటుందన్నారు. లోక్ సత్తా పార్టీ రాజకీయాల నుంచి ఎక్కడికీ పారిపోదని ఆయన అన్నారు. కేంద్రంలో సుస్థిర పాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారని, కొత్త ప్రభుత్వాలు యువత ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రయత్నించాలని ఆయన చెప్పారు. 1971 తర్వాత ప్రజలు స్పష్టమైన అజెండా ఇవ్వడం ఇదే తొలిసారి అని జేపీ అన్నారు.