: బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్!
నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వచ్చేశాయి. వచ్చే 48 గంటల్లో రుతుపవనాలు తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే అండమాన్ పరిసరాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రెంటచింతలలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి, నెల్లూరుల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ తమిళనాడు నుంచి కోస్తాంధ్ర తీరం వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా పాకాలలో 3 సెం.మీ, విశాఖ జిల్లా పాడేరు, అరకులో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.