: రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు లాంటి నేత అవసరం: దేవెగౌడ
ఆంద్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి నేత అవసరం ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దేవెగౌడ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణను, చంద్రబాబు సీమాంధ్రను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ప్రజలు ఆదరించారని దేవెగౌడ పేర్కొన్నారు.