: జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణకు స్వయం ప్రతిపత్తి
జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని శాఖల అధిపతులకు డ్రాయింగ్ అండ్ డిస్బర్స్ మెంట్ అధికారాలను కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను నిరాటంకంగా సాగించేందుకు ట్రెజరీ అండ్ ఫైనాన్సియల్ కోడ్ ను ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.