: తిరుమలేశుని దర్శనానికి బారులు తీరిన భక్తులు
కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి సుమారు 28 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటలు పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 7 గంటల సమయం పడుతోంది.