: ప్రజలు నన్ను దేశ రుణం తీర్చుకోమంటున్నారు: మోడీ
ప్రధాని కావాలన్న తన ఆశయాన్ని గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ చెప్పకనే చెప్పారు. ప్రజలు తనను ఈ దేశ రుణం తీర్చుకోమంటున్నారని చెప్పుకొచ్చారు. 'అప్పుడు ప్రతి ఒక్కరూ నేను గుజరాత్ రుణం మళ్ళీ తీర్చుకున్నానని అన్నారు. ఇప్పుడు ప్రజలు భారత్ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు' అని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఉదయం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.