: మమ్మల్నెందుకు ఓడించారు?: పొన్నం ప్రభాకర్
ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడితే తమను ఎన్నికల్లో ఓడించారంటూ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను గెలిపించారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలా వరకు ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.