: ఉన్నతాధికారులతో సమావేశమైన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఐఏఎస్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీల నియామకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఐవీ సుబ్బారావు, ఐవీఆర్ కృష్ణారావు, లక్ష్మీ పార్థసారధి భాస్కర్, ఏకే పరేరా, దగ్గుబాటి సాంబశివరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.