: ఆరెస్సెస్ పాత్ర ఉండదు: వెంకయ్య నాయుడు
కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక పాత్ర పోషిస్తుందనే వార్తలను బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు ఖండించారు. కేంద్ర మంత్రివర్గంలో సంఘ్ ఎలాంటి పాత్ర పోషించడం లేదంటూ ఆయన వివరణనిచ్చారు. న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద వెంకయ్య మీడియాతో మాట్లాడారు.
తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలను కలవడంలో ఎలాంటి విశేషం లేదని, ఎప్పటిలానే సంఘ్ ను కలిశామని, కేబినేట్ కూర్పులో సంఘ్ జోక్యం ఉండదని వెంకయ్యనాయుడు మీడియాకు వెల్లడించారు.