: హైదరాబాదులో 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు


తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశాలు ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాదులోని గండిపేటలో జరగనున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పుట్టినరోజునాడు ప్రతి ఏటా మహానాడు నిర్వహించడం టీడీపీలో ఆనవాయతీగా వస్తోంది. హైదరాబాదు నగర శివార్లలోని గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఆవరణలో దీనిని జరపాలని నిర్ణయించారు.

ఈసారి సీమాంధ్ర ప్రాంతంలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటంతో టీడీపీలో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో మహానాడును ఘనంగా నిర్వహించాలని నిశ్చయించారు. దీనికి సంబంధించి 21వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకోవడం వీటి లక్ష్యం. 21, 22 తేదీల్లో వీటిని పూర్తి చేసి, 23న జిల్లా కమిటీల సమావేశం నిర్వహించాలని ఈ మేరకు పార్టీ జిల్లా నేతలకు సూచించారు.

  • Loading...

More Telugu News