: ఏడాదిలోపే సీమాంధ్రకు పాలన తరలింపు: చంద్రబాబు
విభజన తర్వాత ఏడాదిలోపే హైదరాబాద్ నుంచి పాలనను నవ్యాంధ్రప్రదేశ్ కు తరలించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కొత్త రాజధాని నిర్ణయించిన వెంటనే పరిపాలనా కేంద్రాన్ని అక్కడకు తరలిస్తామని ఆయన ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. భవనాల నిర్మాణం, రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ వేచి చూడమని, తాత్కాలిక భవనాలు, టెంట్లలోనైనా సరే పాలనను అక్కడి నుంచే సాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే, కేంద్రంలో మోడీ సహకారంతో సీమాంధ్రలో ఐదేళ్లలోపే కొత్త రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. నూతన రాజధాని పాలన, ఆర్థిక కేంద్రంగా ఉంటుందన్నారు.