: చంద్రబాబుకు ఆర్ నారాయణమూర్తి అభినందనలు
సీమాంధ్రలో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబుపై అభినందనల వర్షం కురుస్తోంది. అధ్యక్షుడికి అభినందనలు తెలియజేసేందుకు ఈ రోజు కూడా హైదరాబాద్ లోని ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. మరోవైపు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చంద్రబాబును కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.