: హవాలా రాకెట్ గుట్టురట్టు
హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిన్న రాత్రి హిమాయత్ నగర్ లో 84 లక్షల రూపాయలను దుబాయికి తరలించే యత్నంలో ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేయడంతోపాటు, ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.