: కల్వకుర్తిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అరెస్ట్
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభ బీజేపీ అభ్యర్ధి టి. ఆచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నియోజకవర్గంలోని జూపల్లి లో 119వ పోలింగ్ కేంద్రంలో రేపు రీపోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా కాంగ్రెస్ అభ్యర్ధిని అరెస్ట్ చేయకపోవడంపై బీజేపీ వర్గీయులు ఆందోళనకు దిగారు.