: గుంటూరులో ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్, మంగళగిరిలో ఏపీ డీజీపీ క్యాంప్ ఆఫీస్!
నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు జూన్ 2 తరువాతే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ ను గుంటూరులో, ఏపీ డీజీపీ క్యాంప్ ఆఫీస్ ను మంగళగిరిలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాదులో 3 రోజులు, గుంటూరులో 3 రోజులు ఉండే అవకాశం ఉంది. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు ఇదే ఫార్ములాను కొనసాగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చక చకా పూర్తి చేస్తున్నారు.