: కల్వకుర్తిలోని జూపల్లి గ్రామంలో 19న రీపోలింగ్
మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కల్వకుర్తిలోని 119 నెంబరు పోలింగ్ కేంద్రంలో ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరుగనుంది. కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లోని జూపల్లి గ్రామ ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఓట్లు నమోదు కాలేదని అధికారులు తేల్చారు. దీంతో అక్కడ మళ్లీ పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.