: చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన హరికృష్ణ
టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ ఉదయమే బాబుకు ఫోన్ చేసి అభినందనలు చెప్పిన సంగతి తెలిసిందే.