: బస్సు బోల్తా పడి 14 మంది మృతి


జార్ఖండ్ లో ఓ బస్సు బోల్తా పడి 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన గొడ్డా జిల్లాలోని భాతోండాలో ఇవాళ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది గాయాల పాలయ్యారు. పెళ్లి వేడుకలకు హాజరై, తిరిగి ఇంటికి వస్తుండగా భాతోండా సమీపంలో అకస్మికంగా బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 31 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ అజయ్ లిండా తెలిపారు.

  • Loading...

More Telugu News