: చంద్రబాబు చేయగలరని భావిస్తున్నా: బొత్స


రైతు రుణమాఫీ సాధారణ విషయం కాదని... అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు దాన్ని అమలు చేస్తారని తాను భావిస్తున్నట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తాను ఎవరికీ హాని తలపెట్టలేదని... ఏమైనా తప్పులు చేసి ఉంటే ప్రజలు క్షమించాలని కోరారు. వైకాపా అధినేత జగన్ మాట్లాడిన తీరును చూస్తుంటే... అధికారంలోకి రాలేదన్న నిరాశతో మాట్లాడినట్టు కనిపిస్తోందని అన్నారు. రాజకీయ నాయకుడికి అహం ఉండకూడదని సూచించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి రాష్ట్ర విభజనే కారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు వాచ్ డాగ్ లా వ్యవహరిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో విజయాన్ని సాధించిన మోడీ, చంద్రబాబులకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News