: కేసీఆర్ ను కలిసిన ఉన్నతాధికారులు
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన నివాసంలో పలువురు ఉన్నతాధికారులు కలిశారు. ఇంటెలిజెన్స్ ఐజీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి చేపట్టనున్న సందర్భంగా గౌరవపూర్వకంగా కలిసినట్టు అధికారులు తెలిపారు.