: మంత్రి మండలి ఏర్పాటులో మా పాత్ర ఉండదు: ఆర్ఎస్ఎస్


సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రశంసించింది. దేశ ప్రజలు మార్పు కోసం మోడీకి అనుకూలంగా ఓటు వేశారని సంఘ్ పేర్కొంది. "మార్పును కోరుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు ఊహించినదే. ఇది మాకెంతో ఆనందాన్నిస్తోంది. మోడీ నాయకత్వంలో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం" అని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి రాంమాధవ్ అన్నారు.

ప్రభుత్వం, మంత్రి మండలి ఏర్పాటులో సంఘ్ కు ఎలాంటి పాత్ర ఉండదని రాంమాధవ్ అన్నారు. ఇంటింటికి ప్రచారం చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ వలంటీర్లు చక్కగా పనిచేశారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News