: కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని దీన స్థితి
కాంగ్రెస్ పరిస్థితి చివరికి ఎలా అయిందంటే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా దక్కించుకోలేని విధంగా అన్నమాట. ప్రతిపక్షం హోదా ఇవ్వాలంటే రాజ్యాంగం ప్రకారం మొత్తం పార్లమెంటు స్థానాలలో 10 శాతం సీట్లనైనా గెలుచుకోవాలి. కాంగ్రెస్ 54 స్థానాలు సొంతం చేసుకుంటే ఈ హోదా దక్కేది. కానీ, మోడీ సునామీ ముందు కాంగ్రెస్ 44 స్థానాల దగ్గరే ఆగిపోయింది. దీంతో ప్రతిపక్షం హోదా దక్కే అవకాశాలు లేవు. ఓ సాధారణ పార్టీగా ఉండాల్సిన దీన పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీది. ప్రతిపక్ష హోదా లభిస్తే ఆ పార్టీ పార్లమెంటరీ నేతకు కేబినేట్ హోదా లభిస్తుంది.