: ఆ విషయంలో చంద్రబాబు కంటే జగన్ ముందున్నారు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అత్యధిక మెజారిటీ సాధించారు. అంతేకాదు, సీమాంధ్ర ప్రాంతంలో ఎక్కువ మెజారిటీ సాధించి అందరికన్నా ముందు నిలిచారు. పులివెందుల నుంచి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డిపై 74,256 ఓట్ల మెజారిటీ సాధించారు.
సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇదే! ఆ తర్వాత... బాపట్ల నియోజకవర్గం నుంచి కోన రఘుపతి (వైఎస్సార్సీపీ) 58,013 ఓట్ల మెజార్టీతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. కడప జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో మణిగాంధీ (వైఎస్సార్సీపీ) 52,384 ఓట్ల మెజార్టీతో తృతీయ స్థానంలో ఉన్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు (టీడీపీ) 47,883 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు 47,121 ఓట్లు సాధించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన వారిలో చోటు దక్కించుకున్నారు.