: సోనియా, రాహుల్ రాజీనామా చేయనున్నారా?


ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేయనున్నారంటూ డీల్లీలో వార్తలు గుప్పుమంటున్నాయి. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఓటమికి బాధ్యత వహిస్తూ సోనియా, రాహుల్ రాజీనామా ప్రతిపాదించనున్నట్లు సమాచారం బయటకు పొక్కింది. ఒకవేళ వారు రాజీనామా చేసినా, కాంగ్రెస్ నేతలు ఆమోదించే అవకాశాలు తక్కువే. ఈ వార్తల నేపథ్యంలో... ఎన్నికల్లో ఓటమికి బాధ్యత అందరిదని, దానికి కారణాలు కనుగొంటామని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. అంతేకానీ, నాయకత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. నాయకత్వాన్ని మార్చటం పరిష్కారం కూడా కాదని చెప్పారు.

  • Loading...

More Telugu News