: ముఖ్యమంత్రి మా ‘బాబే’
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించడంతో కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం విద్యార్థి విభాగమైన టీ.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వీట్లు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పం నుంచి గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతోన్న సందర్భంగా వారి ఆనందం అవధులు దాటింది.