: తెలంగాణలో టీడీపీ, వైకాపాలు గెలుపొందడం బాధాకరం: మధుయాష్కీ
తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపొందడం సంతోషకరమేనని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అయితే, తెలంగాణలో టీడీపీ, వైకాపాలు కూడా గెలవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ తో కలసి పనిచేస్తామని చెప్పారు. నిజామాబాద్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత చేతిలో మధుయాష్కీ పరాజయం పాలయ్యారు.