: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కాలం తరువాత ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు విచ్చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయన ట్రస్టు భవన్ కు రావడం ఇదే తొలిసారి. విజయ సారథిగా వచ్చిన చంద్రబాబునాయుడుకు టీడీపీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.