: కారు బానెట్ లో కొండచిలువ


ఉత్తరాఖండ్ లోని హల్ద్ వానీ ప్రాంతం. ఓ కారు భీమ్ టాల్ ప్రాంతంలో ఆగిపోయింది. హోండా కారు షోరూమ్ మెకానిక్కులు వెళ్లి దాన్ని బాగు చేయడం కోసం గ్యారేజీకి తీసుకొచ్చారు. బానెట్ తెరచి చూసి ఉలిక్కిపడ్డారు. 9 అడుగుల పెద్ద కొండ చిలువ అందులో చుట్టలు చుట్టుకుని దర్జాగా కూర్చుంది. వెంటనే బానెట్ ను మూసేసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి దాన్ని 'రా రాజా' అనుకుంటూ తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. కారు చాసిస్ కు ఉన్న రంధ్రం ద్వారా అది లోపలికి వచ్చి ఉంటుందని భావించారు.

  • Loading...

More Telugu News