: మోడీని అమెరికాకు ఆహ్వానించిన ఒబామా
అపూర్వ ఘన విజయాన్ని దక్కించుకుని భారతదేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి, అమెరికా అధ్యక్షుడు ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. నిన్న ఫలితాలు వెలువడ్డాక మోడీకి ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడంతోపాటు, అమెరికాకు రావాలని ఒబామా ఆహ్వానించారు. అనంతరం ఒబామా కార్యాలయం వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వీలుగా ఇరువురికీ ఆమోదనీయమైన సమయంలో వాషింగ్టన్ కు రావాలని మోడీని అధ్యక్షుడు ఆహ్వానించారని అందులో పేర్కొంది.