: వచ్చే ఎన్నికల్లో మెదక్ నుండే పోటీ : విజయశాంతి
వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని సిట్టింగ్ మెదక్ ఎంపీ.. టీఆర్ఎస్ నేత విజయశాంతి తేల్చిచెప్పారు. ఇవాళ ఆమె మెదక్ జిల్లాలో ఇటీవల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి ఆంధ్ర రైతులపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతులపై లేదన్నారు.
కాగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి కూడా మెదక్ నుంచే పోటీచేయాలనే యోచనలో ఉన్న నేపథ్యంలో విజయశాంతి తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.