: నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: జగన్
ఐదేళ్ల పాటు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నరేంద్ర మోడీ గాలితో పాటు చంద్రబాబు తప్పుడు హామీలు తమ ఓటమికి కారణమయ్యాయని అన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు ప్రజల తరపున పోరాడుతామని జగన్ చెప్పారు. తమకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోదని జగన్ స్పష్టం చేశారు.