: డిపాజిట్ గల్లంతైన కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్
కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కు డిపాజిట్ గల్లంతైంది. అరకు లోక్ సభ స్థానం నుంచి ఇద్దరు మహిళలతో పోటీ పడిన కిషోర్ చంద్రదేవ్ అట్టడుగున నిలిచి డిపాజిట్ కోల్పోయారు. ఇప్పటి వరకు కేంద్రమంత్రులంతా ఓటమిపాలైనా ఇంత దారుణమైన ఫలితం చవిచూడలేదు. దీంతో కాంగ్రెస్ నేతలందర్నీ ఓడించి సీమాంధ్రులు కాంగ్రెస్ పార్టీపై తమ అక్కసునంతా వెళ్లగక్కారు. ఇక్కడ వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి గీత విజయం సాధించింది.