: క్లీన్ స్వీపైన బొత్స కుటుంబం


మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కుటుంబం క్లీన్ స్వీప్ అయింది. విజయనగరం జిల్లాను దశాబ్దం పాటు ఏలిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. చీపురుపల్లి నుంచి పోటీ చేసిన సత్తిబాబు టీడీపీ నేతపై ఓటమిపాలవ్వగా, నెల్లిమర్ల నుంచి పోటీ చేసిన ఆయన మేనల్లుడు అప్పలనాయుడు కూడా టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

గజపతినగరం నుంచి పోటీ చేసిన బొత్స తమ్ముడు అప్పలనర్సయ్య టీడీపీ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. విజయనగరం లోక్ సభ స్థానానికి పోటీ చేసిన బొత్స భార్య బొత్స ఝాన్సీ ఓడిపోయారు. దీంతో టీడీపీ చేతిలో బొత్స కుటుంబం క్లీన్ స్వీప్ అయింది.

  • Loading...

More Telugu News