: ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరవని కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. రాష్ట్ర విభజన విషయంలో తీవ్ర అన్యాయంగా వ్యవహరించిన హస్తంపై కొన్ని నెలల నుంచి ఇక్కడి ప్రాంత ప్రజలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో, ఆ పార్టీని ఏపీలో ఘోరంగా ఓడించి మట్టి కరిపించారు. కాంగ్రెస్ నుంచి పొటీ చేసిన ఒక్క నేత కూడా మిగతా అభ్యర్థులకు పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. ఇక అటు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఇంతవరకు ఖాతా తెరవలేదు.