: దావూద్ ఇబ్రహీమో.. జేబు దొంగల ఫొటోలో.. పెట్టుకోండి : రేవంత్ రెడ్డి
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీయార్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బద్ధ విరోదం ఉండేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత ఎన్టీఆర్ ను అవమాన పరచాలని ఎన్నో కుటిల యత్నాలు చేశారని తెలిపారు. అలాంటి వైఎస్ పక్కన ఎన్టీఆర్ ఫొటో ఎలా పెట్టారని ఆయన వైఎస్ఆర్ సీపీ నేతలను ప్రశ్నించారు.
వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తమ పార్టీ బ్యానర్ల మీద దావుద్ ఇబ్రహీం, ముషారఫ్, ఫొటోలు లేదా పోలీస్ స్టేషన్లలో దొరికే జేబుదొంగలు, చిల్లర దొంగల ఫొటోలు పెట్టుకుంటే సమంజసంగా ఉంటుందని రేవంత్ సూచించారు. ఆ పార్టీకి అలాంటి వాళ్ల ఫొటోలే సరిపోతాయన్నారు. ఎన్టీఆర్ ఫొటో వాడుకున్నందుకు ప్రపంచం లోని తెలుగువాళ్లకు వైఎస్ఆర్ సీపీ క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.