: ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్ భార్య


ప్రజాగాయకుడు గద్దర్ భార్య ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ సచివాలయంలో కలిశారు. తన భర్తపై కాల్పులు జరిపిన కేసులో నిందితులను అరెస్టు చేయాలని సీఎంకు ఆమె విన్నవించారు. ఆమెతో బాటు పలు ప్రజా సంఘాల నాయకులు కూడా సీఎంను కలిశారు.

గద్దర్ పై కాల్పులు జరిగి 16 సంవత్సరాలు గడుస్తున్నా, కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని ముఖ్యమంత్రి ప్రజా సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసుకు సంబంధించిన విచారణ వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News