: తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు...మోడీ,బాబుకు అభినందనలు: కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం చూపిన తెలంగాణ ప్రజలకు ధన్యావాదాలని ఆ పార్టీ నేత కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తమపై పోటీ చేసిన ప్రత్యర్థులంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిచాలని కోరారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడుతున్న నేపథ్యంలో అందరూ సహకరించాలని ఆయన సూచించారు. దేశంలో మోడీని నిలువరించిన ఏకైక నేత కేసీఆర్ అని ఆయన అన్నారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు నరేంద్ర మోడీకి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అభినందనలు అని కేటీఆర్ తెలిపారు.