: తిరుపతిలో మోడీ సతీమణి జశోదాబెన్!


తన భర్త నరేంద్రమోడీతో కలసి జశోదాబెన్ గుజరాత్ లోని అంబాజీ శక్తి పీఠం వద్ద ప్రార్థనలు చేయాలని ఆశిస్తున్నారట. అదీ మోడీ ఒప్పుకుంటేనే! మోడీకి 18 ఏళ్ల వయసులో జశోదాతో పెళ్లి అవగా, ఏడాది తర్వాత వారు విడిపోయారు. మళ్లీ కలవలేదు. అయితే, తన భర్తతో తనను కలపాలని కోరుతూ ఆమె 40 ఏళ్లుగా బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోకుండా నియమం పాటిస్తున్నారని ఆమె సోదరుడు అశోక్ తెలిపారు. జశోదాబెన్ దక్షిణ భారత దేశంలో పర్యటిస్తున్నట్లు, బుధవారం తిరుపతిలో ఉన్నట్లు అశోక్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News