: ఇక మోడీ తల్లి భోజనం చేయొచ్చు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విజయం సాధించి, ప్రధాని పదవి చేపట్టాలంటూ ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్న మోడీ తల్లి హీరాబెన్ ఆయన విజయం సాధించారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. ఉదయాన్నే మోడీని ఆశీర్వదించిన ఆమె మోడీ ప్రధాని అవుతాడన్న భరోసాతో ఉన్నారు.