: ఢిల్లీ ఫ్యాన్స్ కు విశ్వాసం లేదంటున్న గౌతీ..


ఐపీఎల్ తొలి మ్యాచ్ లో నెగ్గి శుభారంభం చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ సారథి గౌతమ్ గంభీర్.. మ్యాచ్ అనంతరం ఏమంటున్నాడో వినండి. కోల్ కతా అభిమానులతో పోల్చితే ఢిల్లీ ఫ్యాన్స్ కు విశ్వాసం తక్కువని ఆరోపిస్తున్నాడు. గంభీర్ మూడు సీజన్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఢిల్లీ ప్రేక్షకులు చూపిన అభిమానం కంటే ప్రస్తుతం కోల్ కతా ఫ్యాన్స్ ప్రదర్శిస్తోన్న విధేయత ఎన్నో రెట్లు ఎక్కువని కితాబిచ్చాడు.

నిన్న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో నైట్ రైడర్స్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సందర్భంగా గౌతీ మాట్లాడుతూ, తనకు కోల్ కతాలో సొంత గడ్డ అనుకూలత లేకున్నా.. తన వెనుక 70,000 మంది ప్రేక్షకులు ఉన్నారన్న భావన ఎంతో స్ఫూర్తినిస్తోందని ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో డేర్ డెవిల్స్ విసిరిన 129 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గంభీర్ 29 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

  • Loading...

More Telugu News