: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడే
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 168 కేంద్రాల్లో ఏడువేల టేబుళ్ళలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలకు 598 మంది అభ్యర్ధులు పోటీపడగా, 294 శాసనసభ స్థానాలకు 3,910 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 4.82 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడానికి ఉన్న రెండు పద్ధతుల్లోనూ ఓట్లను లెక్కించి రెండింటిలోను ఒకే రకమైన ఫలితం వచ్చిన అనంతరం ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై పట్ల సర్వత్ర ఉత్కంఠ నెలకొని ఉంది.