: మల్లాది సుబ్బమ్మ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు
ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు ఎంతో కృషి చేశారని చెబుతూ, సారా వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సుబ్బమ్మ సేవలను ఆయన కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.