: వామపక్షాల బంద్ పిలుపు
సర్కారు తీరుపై విపక్షాలు ఒక్కటవుతున్నాయి. 9న రాష్ట్ర బంద్ నిర్వహించాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. వామపక్షాలు కూడా అదే రోజున బంద్ కు పిలుపిచ్చాయి. దీనిపై వామపక్ష నేతలు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన భవన్ లో సమావేశమై చర్చించారు. విద్యుత్ చార్జీలు పెరగడానికి బొగ్గు మాఫియానే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. 9న బంద్ తో రాష్ట్ర సర్కారు కళ్లు తెరిపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు.