: ఆర్టీసీ విభజనకు పాలకమండలి ఆమోదం
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ విభజనకు ఆర్టీసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఆర్టీసీ చేసిన విభజనను ఏ రకమైన అభ్యంతరం లేకుండా ఆర్టీసీ పాలకమండలి ఆమోదించింది. ఆర్టీసీ ఆస్తుల పంపకాలపై సీమాంధ్రకు చెందిన కార్మిక సంఘం ఈయూ అభ్యంతరం తెలిపింది. హైదరాబాదులోని ఆర్టీసీ ఆస్తుల్లో 58 శాతం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీనిపై తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు అభ్యంతరం తెలిపాయి.