: తదుపరి ప్రధానిగా సోనియా చాయిస్ చిదంబరమే?


తమిళ తంబి, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దేశ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందని టైమ్ మేగజైన్ విశ్లేషిస్తోంది. యూపీఏ 2014లోనూ అధికారంలోకి రాగలిగితే మరోసారి మన్మోహన్ ప్రధాని అయ్యే అవకాశాలు చాలా తక్కువని పేర్కొంది. ఆర్థిక వేత్తనే ప్రధానిగా నియమించాలనుకుంటే సోనియాగాంధీ చాయిస్ చిదంబరమేనని తెలిపింది. 

రాహుల్ ప్రధాని కావాలని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. కానీ, రాహుల్ ఇప్పటికీ అధికారం విషయంలో ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఆయన అనాసక్తి పార్టీని కష్టాలలోకి నెడుతుందేమోననే సందేహాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ముందుకు రాకుంటే పీఎం సీటు చిదంబరానిదేనని టైమ్ మేగజైన్ వెల్లడించింది. 

  • Loading...

More Telugu News