: 'హంతకుడు' అంటూ టర్కీ దేశ ప్రధానికి నిరసన సెగ


టర్కీలో బొగ్గుగని ప్రమాదంలో 282 మంది కార్మికులు మృతి చెందారు. మరో 150 మంది గనిలో చిక్కుకున్నారు. కాగా ప్రమాద తీవ్రత తెలుసుకున్న టర్కీ ప్రధాని హుటాహుటిన ప్రమాదస్థలిని సందర్శించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తానని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వస్తుండగా బాధితుల బంధువులు 'హంతకుడు' అని నినాదాలు చేస్తూ ఆయన వాహనంపై దాడికి ప్రయత్నించారు.

దీంతో వారిని అధికారులు అడ్డుకున్నారు. బొగ్గు గనిలో పేలుడు సంభవించినప్పుడు అందులో 787 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని, సహాయక చర్యలకు విషవాయువుల వల్ల అంతరాయం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News