: 17న బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ: రాజ్ నాథ్ సింగ్


భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ నెల 17వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నివాసంలో బుధవారం రాత్రి జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా ఎన్డీయే కూటమి నేతగా మోడీని ఎన్నుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వీలుగా లోక్ సభ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొత్త ప్రభుత్వంలో పార్టీ సీనియర్ల పాత్రపై కూడా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News